Covid: కోవిడ్ వల్ల చంద్రుడిపై మార్పులు
Covid: కోవిడ్ వల్ల యావత్ ప్రపంచం అల్లాడిపోయింది. ప్రపంచం అంటే భూమి. కోవిడ్ వల్ల భూమిపై ఉన్న మనుషులు ఎన్నో అవస్థలు పడ్డారు కానీ.. చంద్రుడికి ఏమైంది? అసలు కోవిడ్ వల్ల చంద్రుడిపై మార్పులు రావడం ఏంటి? అవును.. కోవిడ్ 19 భూమినే కాదు చంద్రుడిని కూడా కుదిపేసింది. భారత శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది ఏంటంటే.. కోవిడ్ కారణంగా చంద్రుడిపై ఉష్ణోగ్రతలు పడిపోయాయట. 8 నుంచి 10 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
నాసా నుంచి తెప్పించుకున్న 2017 నుంచి 2023 డేటాను భారతీయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. కోవిడ్ వల్ల లాక్‌డౌన్ పడటంతో మనుషులు బయట తిరగడం మానేసారు. వాహనాలు నడపం బంద్ అయ్యాయి. దాంతో మన గ్రీన్ హౌజ్ వాయువులు, ఏరోసోల్స్ ఉత్పన్నం కావడం తగ్గిపోయాయి. దాంతో భూమిపై తక్కువ వేడి పుట్టడం.. ఆ వేడి కాస్తా భూమి నుంచి అంతరిక్షంలోకి రేడియట్ అవ్వడం జరిగాయి. చంద్రుడిపై అట్మోస్పియర్ ఉండదు కాబట్టి తన చుట్టూ ఉన్న వాటి నుంచి వేడిని గ్రహించుకుంటుంది. అలా భూమిపై తక్కువ వేడి ఏర్పడటంతో చంద్రుడిపై చల్లదనం పెరిగిపోయింది.
అలా 2020 వరకు చంద్రుడిపై మరింత చల్లదనం ఏర్పడింది. ఆ తర్వాత కోవిడ్ తగ్గుముఖం పట్టడం.. మళ్లీ సాధారణ జీవితాలు మొదలుకావడంతో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు పెరిగాయి.