Chandrayaan 3: విక్ర‌మ్‌.. ప‌ద చూస్కుందాం..!

ఇస్రో (isro) చేప‌ట్టిన‌ ప్ర‌తిష్ఠాత్మ‌క చంద్ర‌యాన్ 3 (chandrayaan 3) మిష‌న్‌కి ఈరోజు ఎంతో ముఖ్య‌మైన‌ది. విక్ర‌మ్ రోవ‌ర్ (vikram) ఈరోజు సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో చంద్రుడిపై కాలు మోపుతుంది. ఈ చారిత్ర‌క ఘ‌ట్టాన్ని తిల‌కించేందుకు యావ‌త్ ప్ర‌పంచం ఎదురుచూస్తోంది. ఈ నేప‌థ్యంలో యావ‌త్ భార‌త‌దేశంలో ఓ వైపు సక్సెస్ పార్టీలు మ‌రోవైపు ప్రార్థ‌నలు మిన్నంటుతున్నాయి.

*విక్ర‌మ్ రోవ‌ర్ ల్యాండింగ్‌ని సాయంత్రం టీవీలో టెలికాస్ట్ చేస్తారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ బ్రిక్స్ స‌దస్సులో భాగంగా సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. ఆయ‌న అక్క‌డి నుంచే చంద్ర‌యాన్ 3 ల్యాండింగ్‌ని వీక్షిస్తారు.

*మ‌న భార‌త్‌తో పాటే ర‌ష్యా కూడా లూనా 25 (luna 25) పేరిట ఒక రోవ‌ర్‌ను చంద్రుడి ద‌క్షిణ ధ్రువం వైపు ప్ర‌వేశ‌పెట్టింది. అయితే అది చంద్రుడి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గానే పేలిపోయింది. దాంతో ర‌ష్యాకు చెందిన టాప్ సైంటిస్ట్ ఒక‌రు దిగులుతో మంచాన‌పడ్డారు. లూనా 25 మాదిరిగానే 2019లో ఇస్రో ప్ర‌వేశ‌పెట్టిన చంద్ర‌యాన్ 2 చంద్రుడిపై ఉన్న లోతైన గుంత‌ల్లో కాలు పెట్ట‌లేక కూలిపోయింది. దాంతో మ‌న చంద్రయాన్ విజ‌య‌వంతం కావాల‌ని కోట్లాది మంది భార‌తీయులు పూజ‌లు చేస్తున్నారు. (chandrayaan 3)

*చంద్ర‌యాన్ 2 నుంచి నేర్చుకున్న గుణ‌పాఠాల‌న్నీ చంద్ర‌యాన్ 3కి బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని.. రోవ‌ర్ విక్ర‌మ్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జాబిల్లిపై కాలు పెట్టి తీరుతుంద‌ని ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

*ఇస్రో వెబ్‌సైట్‌, యూట్యూబ్ ఛానెల్‌తో పాటు డిడి నేష‌న‌ల్ టీవీలో చంద్ర‌యాన్ 3 ల్యాండింగ్ లైవ్ వీక్షించ‌వ‌చ్చు. సాయంత్రం 5:30 నుంచి ప్ర‌సారం అవుతుంది.

*చంద్రుడిపై నీటి వ‌న‌రులు ఉన్నాయ‌ని ఇస్రో గుర్తించింది. దీని వ‌ల్ల భవిష్య‌త్తులో మ‌రిన్ని జాబిల్లికి సంబంధించిన మిషన్లు చేప‌ట్టే అవ‌కాశం ఉంది. ర‌ష్యా, అమెరికా, చైనా త‌ర్వాత రోవ‌ర్‌ను చంద్రుడిపై ప్ర‌వేశ‌పెట్టిన నాలుగో దేశంగా మ‌న భార‌త్ నిలిచింది. (chandrayaan 3)

*ఈ మిష‌న్ పూర్త‌య్యాక ఇస్రో బ్యాక్ టు బ్యాక్ మ‌రిన్ని మిష‌న్లు చేపట్ట‌నుంది. వాటిలో సూర్యుడికి సంబంధించిన మిష‌న్, హ్యూమ‌న్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్, గ‌గ‌న్‌యాన్, ఆదిత్య‌-ఎల్ 1 ఉన్నాయి. సూర్యుడిపై రీసెర్చ్ చేసేందుకు మొద‌టి స్పేస్ ఆధారిత ఇండియ‌న్ అబ్స‌ర్వేట‌రీ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. సెప్టెంబ‌ర్ మొద‌టివారింలో ఈ రీసెర్చ్ మొద‌లుపెట్ట‌నున్నారు.