Chandrayaan 3: టెలిస్కోప్‌లో క‌నిపించిన విక్ర‌మ్ రోవ‌ర్‌.. నిజ‌మేనా?

దేశ‌వ్యాప్తంగా చంద్ర‌యాన్ 3 (chandrayaan 3)ల్యాండింగ్‌ని లైవ్‌గా వీక్షించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఓ వ్య‌క్తి త‌న టెలిస్కోప్ నుంచి చంద్రుడిని జూమ్ చేసి చూడ‌టంతో విక్ర‌మ్ రోవ‌ర్ మ‌న జాతీయ జెండాతో చంద్రుడి చుట్టూ తిరగ‌డం క్లియ‌ర్‌గా క‌నిపిస్తోంది. దాంతో ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. చాలా మంది ఇది ఫేక్ అంటున్న‌ప్ప‌టికీ.. తాను టెలిస్కోప్‌లో చూసిన‌ప్పుడు క‌నిపించింది కాబ‌ట్టే పోస్ట్ చేసాన‌ని ఆ వ్య‌క్తి తెలిపాడు. (chandrayaan 3)