Chandrayaan 3: విక్రమ్.. విజయవంతం..!
చంద్రయాన్ 3 (chandrayaan 3) మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ (vikram lander) జాబిల్లిపై అడుగుపెట్టేసింది. అందరూ ఊహించినట్లుగానే విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసేసింది. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉందని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. ఈ శుభ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi) ఇస్రో (isro) శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. నేలపై కల కని దానిని చంద్రుడిపై నిజం చేసుకున్నామని, ఇప్పుడు ఇండియా చంద్రుడిపై ఉందని తెలిపారు. బ్రిక్స్ సమ్మిట్ కోసమని సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పటికీ తన మనసంతా ఇండియా, చంద్రయాన్ -3 మిషన్‌పైనే ఉందని పేర్కొన్నారు. (chandrayaan 3)