జాబిల్లిపై చంద్రయాన్ 3 చనిపోయినట్లేనా..?!
చంద్రయాన్ 3లో (chandrayaan 3) భాగంగా జాబిల్లిపై 15 రోజుల పాటు స్లీప్ మోడ్‌లో ఉన్న విక్రమ్ ల్యాండర్ (vikram lander), ప్రజ్ఞాన్ రోవర్ (pragyan rover) నుంచి మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా సిగ్నల్ రావడంలేదు. దాంతో ఆ రెండూ ఇక చనిపోయినట్లేనని ఇస్రో భావిస్తోంది. జాబిల్లి దక్షిణ ధృవంపై 15 రోజుల పాటు సూర్య కిరణాలు పడవు కాబట్టి సెప్టెంబర్ 2న ఇస్రో విక్రమ్, ప్రజ్ఞాన్‌లను స్లీప్‌మోడ్‌లోకి పంపింది. 23న నిద్రలేపడానికి యత్నిస్తున్నప్పటికీ వాటి నుంచి ఒక్క సిగ్నల్ కూడా రాలేదు. సాధారణంగా 24 గంటల్లోనే సిగ్నల్స్ రావాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సమయం అవుతున్నా అవి నిద్రలేవకపోవడంతో ఇక అవి చనిపోయినట్లు భావించాలని ఇస్రో తెలిపింది.
సెప్టెంబర్ 30 వరకు విక్రమ్, ప్రజ్ఞాన్‌లను నిద్రలేపడానికి ఇస్రో ప్రయత్నిస్తూనే ఉంటుంది. అక్టోబర్ 1నుంచి 15 వరకు మళ్లీ సూర్యకిరణాలు చంద్రుడిపై పడవు కాబట్టి ఇక అవి నిద్రలేవకపోయినా చంద్రయాన్ 3 మిషన్‌కు కావాల్సిన అన్ని విషయాల్లో అవి సక్సెస్ అయ్యాయి అనుకుని వాటి గురించి మర్చిపోవాల్సిందేనని తెలిపారు.