Chandrayaan 1: జాబిల్లిపై నీరు… భూమి సాయమే..!
జాబిల్లిపై నీరు ఉందంటే.. అందుకు భూమే కారణమట. భూమి సాయం చేయడం ద్వారానే చంద్రుడిపై నీరు ఉన్నట్లు చంద్రయాన్ 1 (chandrayaan 1) మిషన్‌లో తేలింది. భారత్ చేపట్టిన మొదటి లూనార్ మిషన్ చంద్రయాన్ 1. జాబిల్లిపై ఉన్న చంద్రయాన్ 1 ఆర్బిటార్ నుంచి రిమోట్ సెన్సింగ్ డేటాను పరిశీలిస్తున్న హవాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. భూమిపై ఉన్న ప్లాస్మా పొరలోని ఎలక్ట్రాన్ల ఆధారంగానే జాబిల్లిపై నీరు వచ్చి చేరిందని తెలిపారు. సోలార్ విండ్ అంటే సౌర గాలిలో ఉండే ప్రోటాన్స్ ద్వారా కూడా జాబిల్లిపై నీరు చేరే అవకాశం ఉందని రీసెర్చ్‌లో తేలింది. (chandrayaan 1)
చంద్రుడికి అవతలి వైపు ఉన్న భాగాన్ని మ్యాగ్నెటో టెయిల్ (magneto tail) అంటారు. మ్యాగ్నెటో టెయిల్ సమయంలో సౌర గాలులు వీయకపోవచ్చు కానీ సూర్య కిరణాలు మాత్రం పడతాయి. సౌర గాలులు తాకవు కాబట్టి చంద్రుడికి అవతలి వైపు నీరు ఉండటం సాధ్యపడదని శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ చంద్రయాన్ 1 నుంచి సేకరిస్తున్న డేటా చూసాక సౌర గాలులు లేకపోయినప్పటికీ నీటి వనరులు ఏర్పడుతుండడం చూసి షాకయ్యారు.
2009లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 1 మిషన్‌లో భాగంగానే చంద్రుడిపై నీటి వనరులు ఉన్నాయన్న కీలక విషయం బయటపడింది. ఈ మిషన్‌లో భాగంగా ఓ ఆర్బిటార్, ఓ ఇంపాక్టర్‌ను అమర్చారు. ఇప్పటికీ చంద్రయాన్ 1 ఆర్బిటార్ చంద్రుడిపై తిరుగుతోంది. ఇక ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 కూడా విజయవంతం అయింది. ప్రస్తుతానికి విక్రమ్ రోవర్, ప్రజ్ఞాన్ ల్యాండర్లు జాబిల్లిపై స్లీప్ మోడ్‌లో ఉన్నాయి. మరోపక్క ఆదిత్య ఎల్ 1 మిషన్ కూడా ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇంకొన్ని రోజుల్లో సూర్యుడి గురించి పరిశోధనలు చేసేందుకు ఎల్ 1 పాయింట్‌కు చేరుకోనుంది.