CCTV Camera: కాపురంలో చిచ్చుపెట్టిన సీసీ కెమెరా

Kerala: సీసీటీవీ(cctv camera) దంప‌తుల జీవితంలో నిప్పులు పోసింది. దాంతో ఇప్పుడు అత‌ని జీవితం ఏంటో అత‌నికే అర్థం కావ‌డంలేదు. అస‌లేం జ‌రిగిందంటే.. కేర‌ళ‌(kerala)లోని ఇడుక్కి ప్రాంతానికి చెందిన ఓ 32 ఏళ్ల వ్య‌క్తి బ‌ట్ట‌ల దుకాణాన్ని న‌డుపుతున్నాడు. ఇత‌నికి భార్య‌, ఓ కూతురు ఉన్నారు. వారం రోజుల క్రితం ఓ రోజు రాత్రి దుకాణం మూసి స్కూటీపై ఓ యువ‌తిని ఎక్కించుకుని సిగ్న‌ల్ ప‌డినా ఆగ‌కుండా వెళ్లిపోయాడు. దాంతో అక్క‌డే ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు(cctv) ఫొటోలు తీయ‌డంతో మోట‌ర్ వెహికిల్ డిపార్ట్‌మెంట్ చలానా విధించింది. చ‌లానాతో పాటు ఆ ఫొటోల‌ను కూడా పంపించింది. ఇక్క‌డే ఆ వ్య‌క్తి ఇరుక్కుపోయాడు. ఆ బండి అత‌ని భార్య‌ది. దాంతో చ‌లానా, ఫొటోలు ఉన్న‌ మెసేజ్ ఆమెకే వ‌చ్చింది.

దాంతో ఆమెతో అక్ర‌మ సంబంధం ఉందంటూ భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డింది. ఆమెకు త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని, లిఫ్ట్ అడిగితే ఇచ్చాన‌ని అత‌ను మొత్తుకున్నా విన‌లేదు. దాంతో త‌నను, కూతురిని కొట్టాడంటూ పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టింది. ఆ వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచార‌ణ చేప‌డుతున్నారు.