Paris Olympics: మేం సెక్స్‌కి వ్యతిరేకం కాము..!
Paris Olympics: ఈసారి ఒలింపిక్స్ క్రీడలకు పారిస్ వేదికగా మారనుంది. జులై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు ఈ ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. అయితే క్రీడాకారులు నిద్రపోయేందుకు కోసం పారిస్ గేమ్స్ యాజమాన్యం ప్రత్యేకమైన పరుపులను తెప్పించింది. ఎయిర్ వీవ్ అనే జపనీస్ కంపెనీ ఈ పరుపులను డిజైన్ చేసింది. ఈ పరుపులను కార్డ్‌బోర్డుతో తయారుచేసింది. అయితే పారిస్ గేమ్స్ యాజమాన్యం క్రీడాకారులను సెక్స్‌లో పాల్గొనకుండా ఉండేందుకే ఆ కార్డ్‌బోర్డుతో తయారుచేసిన పరుపులను తెప్పించిందని మీడియా వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై తీవ్ర దుమారం నెలకొంది. దాంతో పారిస్ గేమ్స్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.
పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా ఉండేలా కార్డ్‌బోర్డ్ పరుపులను తెప్పించామే కానీ తాము క్రీడాకారుల సెక్స్ జీవితాన్ని వ్యతిరేకించడంలేదని తెలిపింది. ఒలింపిక్ క్రీడలు అయ్యాక క్రీడాకారులు వారిన ఆ పరుపులను రీసైకిల్ చేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇక్కడ సెక్స్ విషయం ఎందుకు వచ్చిందంటే.. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు తమకు నచ్చిన వారితో సెక్స్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఆచారం 1980ల నుంచే ఉంది. అంతేకాదు.. వాళ్లు సేఫ్ సెక్స్‌లో పాల్గొనేందుకు దాదాపు 30 వేల కండోమ్‌లను కూడా తెప్పించింది. ఇప్పుడు క్రీడాకారులకు కార్డ్‌బోర్డు పరుపులను తెప్పించి వారిని సెక్స్‌లో పాల్గొనకుండా చేస్తున్నారంటూ కొందరు విమర్శలు గుప్పించడంతో పారిస్ గేమ్స్ మేనేజ్‌మెంట్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.