High Court: నల్లగా ఉన్నావన్న భార్య.. కోర్టుకెక్కిన భర్త
Bengaluru: కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి చర్చనీయాంశంగా మారింది. భార్యను భర్త కానీ భర్తను భార్య కానీ నల్లగా ఉన్నావు అంటే అది కచ్చితంగా క్రూరమైన నేరం కిందికే వస్తుందని హైకోర్టు తీర్పు వెల్లడించింది. (high court) బెంగళూరుకు చెందిన 44 ఏళ్ల వ్యక్తి విడాకుల కోసం హైకోర్టుకి వెళ్లడంతో ఈ కేసు వివరాలు బయటికి వచ్చాయి. తన భార్య నల్లగా ఉన్నావంటూ టార్చర్ చేస్తోందని భర్త పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే వాదనల సమయంలో మహిళ తప్పుడు ఆరోపణలు చేసినట్లు కోర్టు తెలిపింది.
భర్త రంగు గురించి కామెంట్స్ చేస్తూ.. ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికి తన భర్తకు బయట అఫైర్లు ఉన్నాయని చెప్పిందని అది నేరం అని మందలించింది. ఈ జంటకు 2007లో వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. 2012లో భర్త విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇన్నాళ్లూ బిడ్డ కోసం తన భార్య ఎన్ని మాటలన్నా భరించానని భర్త కోర్టుకు తెలిపాడు. దీనిపై వాదోపవాదాలు విన్న న్యాయస్థానం.. చర్మ రంగు గురించి భార్య, భర్తల్లో ఎవరు కామెంట్ చేసినా అది నేరమేనని.. అలాంటి కేసుల్లో విడాకులు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించింది. (high court)