Cab: ఇండియాకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ పెట్టిన 6 రూల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది కచ్చితంగా ఏ రాష్ట్రంలో జరిగిందో తెలీదు కానీ తన క్యాబ్‌లో ఓ పేపర్‌ను అంటించి అందులో 6 నియమాలను రాసుకున్నాడు. వాటిని ఆచరిస్తేనే తన క్యాబ్‌లో ప్రయాణించేందుకు అవకాశం ఉంది అని పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ రూల్స్ ఏంటంటే..
నన్ను అన్న, భయ్యా అని పిలవద్దు. నాకు అలా పిలిస్తే నచ్చదు. మర్యాదగా పేరు పెట్టి పిలవాలి
లేట్ అవుతోంది త్వరగా వెళ్లండి అని అస్సలు అనకూడదు. మీకు అంత లేట్ అయితే మీరే కాస్త త్వరగా బయలుదేరాలి.
కారులో కూర్చున్నాక డోర్ మెల్లిగా వేయాలి.
క్యాబ్ ఓనర్ మీరు కాదు. క్యాబ్ నడిపేవాడే ఓనర్. మీరు ప్రయాణికులు మాత్రమే
మీరు మీ ఈగోని యాటిట్యూడ్‌ని నా ముందు చూపించకండి. మీకు అంత యాటిట్యూడ్ ఉంటే మడిచి జేబులో పెట్టుకోండి. మీరేమీ నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వడంలేదు.
మర్యాదగా మాట్లాడాలి. మీరు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది.