Buried Alive: శవపేటికలో 11 రోజులు సజీవంగానే..!
చనిపోయిందనుకుని ఓ మహిళను శవపేటికలో పెట్టి సమాధి చేసేసారు (buried alive). తీరా చూస్తే ఆమె బతికే ఉంది. పైగా 11 రోజుల పాటు సమాధి కింద శవపేటికలో సజీవంగానే ఉండటం ఆశ్చర్యకరం. ఈ విచిత్ర ఘటన బ్రెజిల్‌లో (brazil) చోటుచేసుకుంది. రోసాంగేలా (rosangela) అనే 37 ఏళ్ల యువతి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. దాంతో ఆమెను శవపేటికలో పెట్టి సమాధి చేసారు.
అయితే ఆమెను పూడ్చిపెట్టిన శ్మశాన వాటిక నుంచి వింత శబ్దాలు రావడంతో వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు పోలీసులకు సమాధానం ఇచ్చారు. రీసెంట్‌గా పాతిపెట్టిన సమాధులను పరిశీలించగా రోసాంగెలా సమాధి పై భాగం తవ్వినట్లుగా కనిపించింది. దాంతో వెంటనే సమాధి మొత్తాన్ని తవ్వించి శవపేటికను బయటికి తీసారు. శవపేటికలో రోసాంగెలా శరీరం వెచ్చగానే ఉన్నట్లు గ్రహించడంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. దురదృష్టవశాత్తు ఆమె హాస్పిటల్‌లో చనిపోయింది. అయితే రోసాంగెలాను శవపేటికలో పెట్టి సమాధి చేసినప్పుడు ఆమె బతకే ఉందని.. 11 రోజుల పాటు సమాధి నుంచి బయటికి రావాలని ఎంతో ప్రయత్నించిందని పోస్ట్ మార్టెం రిపోర్ట్‌లో వెల్లడైంది. (buried alive)