BRS నేత అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
BRS: వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు ఓ భర్త. ఈ ఘటన అల్వాల్‌లో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్లకు చెందిన గంభీరావుపేట రెడ్డి సంఘం అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు శ్రీకాంత్ రెడ్డి భార్య ఉండగా మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్యను వదిలేసి హైదరాబాద్‌లోని అల్వాల్‌లో వివాహితతో కాపురం పెట్టాడు. విషయం తెలుసుకుని వారిద్దరినీ భార్యతో పాటు కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడే ఉన్న మరో మహిళను శ్రీకాంత్ భార్య చెప్పుతో కొడుతుండగా కుటుంబ సభ్యులు వీడియోలు తీసారు. వివాహితకు భర్తను దూరం చేసి.. అతనిపై శ్రీకాంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించాడు. ఆ తర్వాత ఆమతో కలిసి సహజీవనం చేస్తున్నాడు.