British Nurse: 7 చిన్నారులను చంపేసిన కీచకురాలు
పై ఫొటోలో కనిపిస్తున్న యువతిని చూసారా? (british nurse) చూడటానికి ఏమీ తెలీనట్లు ఉంది కానీ అదో రాక్షసి. పసికందులన్న కనికరం కూడా లేకుండా ఒక్క ఏడాదిలో ఏడుగురు చిన్నారులను చంపేసింది. ఇంకో ఆరుగురు పసికందుల్ని కూడా చంపాలని ప్లాన్ వేసింది. దాంతో ఆమెకు బ్రిటన్‌లోనే (britain) అత్యంత కీచక కిల్లర్ అని పేరు పెట్టారు. ఈమె పేరు లూసీ లెట్బీ (lucy letby). బ్రిటన్‌లోని ఓ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తోంది.
నార్త్‌వెస్ట్ ఇంగ్లాండ్‌లోని చెస్టర్ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తున్న లూసీ.. 2015 నుంచి 2016 వరకు ఏడుగురు పసికందుల్ని పొట్టనబెట్టుకుంది. అందులోనూ నెలలు నిండకుండానే పుట్టిన పసికందులను మాత్రమే టార్గెట్ చేసేది. వారికి లిమిట్‌కి మించి పాలు తాగించడం.. వారు తాగే పాలల్లో ఇన్సులిన్ కలపడం వంటివి చేసి తాగించేది. పైగా ఎంత తెలివిగా చంపేదంటే.. ఎవ్వరికి కూడా ఆ పసికందులు ఎవరో చంపేసారు అని కూడా తెలిసేది కాదట. (british nurse)
అప్పుడే అనుమానం వచ్చింది
ఒంట్లో బాలేని పసికందుల్ని చూసుకోవడానికి వేరే నర్సులను నియమించినప్పుడు నేను దగ్గరుండి చూసుకుంటా మీరు వెళ్లండి అని చెప్పి నమ్మబలికేదట. అలా లూసీ ఏ చిన్నారిని చూసుకోవడానికి ఉండేదో ఆ మరుసటి రోజు ఆ పసికందు చనిపోయేదట. దాంతో తోటి నర్సులు ఏదో జరుగుతోందని అనుమానం వచ్చి లూసీపై యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. ఒక సంవత్సరంలో ఏడుగురు పసికందులు చనిపోవడంతో అనుమానం రెట్టింపైంది. అలా హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడే లూసీపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రెండు సార్లు విడుదల కూడా అయ్యింది. చివరిసారిగా.. పోలీసులు ఆమె ఉంటున్న నివాసాన్ని తనిఖీ చేయగా.. నేను రాక్షసిని.. ఇదంతా నేనే చేసాను అని రాసున్న పేపర్ లభించింది. ఆ తర్వాత ఆ పిల్లల చావుకి తానే కారణం అని ఒప్పుకుంది. (british nurse)