Kate Middleton: కనిపించని బ్రిటన్ యువరాణి.. కోమాలో ఉన్నారా?
Kate Middleton: బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్‌టన్ రెండు నెలలుగా కనిపించడం లేదు. ఆమెకు రెండు నెలల క్రితం కడుపు భాగంలో సర్జరీ జరిగింది. ఆ తర్వాత నుంచి అసలు బ్రిటన్‌లోని అధికారిక రాజ నివాసం అయిన కెన్సింగ్టన్ ప్యాలెస్ బయటకు ఆమె వచ్చిందే లేదు. దాంతో అక్కడి ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేట్ మిడిల్టన్ కోమాలోకి వెళ్లిపోయారని ఈ విషయాన్ని బయటికి రాకుండా ప్యాలెస్ సిబ్బంది దాచిపెడుతోందని ఆరోపిస్తున్నారు.
జనవరి 17న కేట్ మిడిల్టన్‌కు సంబంధించి కెన్సింగ్టన్ ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆమెకు కడుపులో సర్జరీ జరగనుందని.. ఇందుకోసం ఓ 10 నుంచి 17 రోజుల వరకు రెస్ట్‌లో ఉంటారని ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరని పేర్కొన్నారు. సర్జరీ జరిగి నెల గడుస్తోంది. ఇంకా కేట్ మిడిల్టన్ బయటికి రాకపోవడం గమనార్హం. సర్జరీ జరుగుతున్న సమయంలో కాంప్లికేషన్స్ వచ్చినట్లున్నాయని దాంతో ఆమె కోమాలోకి జారుకున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. (Kate Middleton)
ALSO READ: Kohinoor Diamond: ఈ వజ్రానికి నిజంగా శాపం ఉందా? మరణం తప్పదా?
అయితే ఆమె సర్జరీ వికటించి కోమాలోకి జారుకోలేదని.. ఆమె ఆరోగ్యం మరింత మెరుగుపడాలని వైద్యులే ఇన్‌డ్యూస్డ్ కోమా ఇచ్చారని స్థానిక స్పానిష్ టీవీ జర్నలిస్ట్ కోంచా కలేజా వెల్లడించారు. ఇన్‌డ్యూస్డ్ కోమా అంటే వైద్యులే ఓ మోతాదులో మత్తు మందు ఇస్తారు. దీని వల్ల పేషెంట్ తాత్కాలిక కోమాలోకి వెళ్లి సర్జరీ నుంచి త్వరగా కోలుకోగలుగుతారు. మార్చి తర్వాత నుంచి కేట్ మిడిల్టన్ బయటికి వస్తారని.. ఆమె సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోవడానికి 9 నెలలు పడుతుందని కెన్సింగ్టన్ ప్యాలెస్ అధికారిక ప్రతినిధులు వెల్లడించారు. అప్పటివరకు ఎవరూ ఎలాంటి వదంతులు నమ్మొద్దని.. ఇలాంటి వదంతులు సృష్టిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మరోపక్క బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ మరణంతో ఆమె భర్త చార్ల్‌స్ సింహాసనాన్ని అధిష్టించారు. 75 ఏళ్ల చార్ల్‌స్ ఎట్టకేలకు బ్రిటన్‌కు మహారాజయ్యారు. కానీ ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పాపం చార్ల్‌స్‌కు క్లోమ గ్రంథి క్యాన్సర్ అని ఇటీవల ఆయన అధికారిక నివాసం అయిన బకింగ్‌హామ్ ప్యాలెస్ సిబ్బంది ప్రకటించారు.