కాబోయే బావపై కన్నేసి.. అక్క పెళ్లి ఆపేసింది!
Bihar: పెళ్లి(wedding) వేడుకలో వరుడు అందరికీ షాకిచ్చాడు. పెళ్లికూతురి(bride) చెల్లెలితో ప్రేమలో ఉన్నట్లు చెప్పి పెళ్లి ఆపించేసాడు. ఈ ఘటన బిహార్‌లో(bihar) చోటుచేసుకుంది. శరణ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి.. అదే ప్రాంతానికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. అయితే.. ఇంటర్ చదువుతున్న పెళ్లికూతురు చెల్లెలు.. కాబోయే బావపై కన్నేసింది. పరీక్షల పేరు చెప్పి తరచూ పెళ్లికొడుకును కలుస్తూ ఉండేది. అలా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని రోజూ మాట్లాడుకునేవారు. పలుమార్లు శారీరకంగా కలిసారు కూడా. అయితే.. పెళ్లి రోజు వచ్చేసరికి తన అక్కను పెళ్లిచేసుకుంటే దూకి చచ్చిపోతానని వరుడికి ఫోన్ చేసి షాకిచ్చింది. ఇంకేమీ చేయలేక.. పెళ్లి ఆపేయాల్సి వచ్చింది. ఇక దాచలేక ఉన్న విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పేసాడు. దాంతో పెద్ద గొడవ జరిగింది. పోలీసులు కలగజేసుకుని సర్దిచెప్పారు. ఇక చేసేదేంలేక పెళ్లికూతురి చెల్లితో ఆ వరుడికి పెళ్లి జరిపించారు.