బ‌రువు త‌గ్గేందుకు వ‌ధువు స‌ర్జరీ.. పెళ్లి రోజే మృతి

bride under goes weight loss surgery and dies

పెళ్లి వేడుక‌లో స‌న్నగా అందంగా క‌నిపించాల‌ని ఓ యువ‌తి స‌ర్జ‌రీ చేయించుకుంది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు స‌ర్జ‌రీ వికటించి పెళ్లి రోజే ఆమె చ‌నిపోయింది. ఈ విషాద ఘ‌ట‌న బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. లౌరా అనే యువ‌తి త‌న పెళ్లి స‌మ‌యానికి ఎనిమిది కిలోల బ‌రువు త‌గ్గాల‌నుకుంది. పెళ్లికి త‌క్కువ స‌మ‌యం ఉండ‌టంతో వ్యాయామంతో 8 కిలోలు త‌గ్గ‌లేమ‌ని తెలిసి స‌ర్జ‌రీ చేయించుకోవాల‌నుకుంది.

స‌ర్జ‌రీ ప్రక్రియ‌లో భాగంగా వైద్యులు లౌరా క‌డుపులో గ్యాస్ట్రిక్ బెలూన్ పెట్టారు. ఆ సిలికాన్ బెలూన్‌లో సెలైన్ నింపి ఉంచుతారు. దీని వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లిగి ఏమీ తిన‌కుండా ఉంటారు. ఈ నేప‌థ్యంలో మ‌రుస‌టి రోజే పెళ్లి ఉంద‌న‌గా.. ఆ బెలూన్‌ని తొల‌గించాల‌నుకున్నారు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ వ‌ల్ల లౌరా రక్త వాంతులు చేసుకుంది. క‌డుపులో ఇన్‌ఫెక్ష‌న్ సోక‌డంతో ఆమె పెళ్లి రోజే మృతిచెందింది. దాంతో లౌరా త‌ల్లిదండ్రులు హాస్పిట‌ల్‌పై కేసు వేసారు.