పెళ్లైన 17 రోజులకు భర్తకు నవ వధువు ట్విస్ట్
Bride: ప్రపంచంలోని ఏ భర్తకీ ఇలాంటి సంఘటన జరగకూడదు. పెళ్లైన 17 రోజులకే నవ వధువు తన భర్తకు షాకిచ్చింది. దాంతో అతని మనసు ముక్కలైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. మొన్న ఫిబ్రవరిలో గ్వాలియర్‌కి చెందిన సంతోష్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన అంజలి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
ఈ పెళ్లిని సంతోష్‌కి తెలిసిన వ్యక్తి అయిన నితిన్ దగ్గరుండి జరిపించాడు. ఆ తర్వాత హోలీ సందర్భంగా మార్చిలో అంజలి పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లింది. ఆ తర్వాత కొన్ని రోజులకు సంతోష్ అంజలి ఇంటికి వెళ్లి మరీ ఆమెను కాపురానికి తెచ్చుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మళ్లీ అంజలి కొన్ని రోజులకే పుట్టింటికి వెళ్తానని గొడవ చేసింది. సరే వెళ్లు కానీ త్వరగా వచ్చేయాలి అని చెప్పి సంతోష్ ఆమెను సాగనంపాడు.
ఇదిలా ఉండగా సంతోష్ ఇంట్లో నగలు, రూ.25 వేల డబ్బు మాయమైపోయాయి. అతను కంగారుగా వాటి కోసం వెతుకుతుండగా.. అంజలి తల్లి నుంచి ఫోన్ వచ్చింది. అంజలి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని షాకింగ్ న్యూస్ చెప్పింది. దాంతో సంతోష్ ఆమె కోసం వెతుకుండగా.. అతనికి వాట్సాప్‌లో ఓ ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో అంజలితో పాటు మరో వ్యక్తి ఉన్నాడు.
ఎవరితను ఏంటిదంతా అని సంతోష్ కోపంగా అడగ్గా.. తనకు 2023 అక్టోబర్‌లోనే అభిషేక్ అనే వ్యక్తితో పెళ్లైందని.. ఈ విషయం పెళ్లి జరిపించిన నితిన్‌కి కూడా తెలుసని గుండె పగిలే వార్తను చెప్పింది. దాంతో సంతోష్ ఎంతో బాధపడ్డాడు. వెంటనే వెళ్లి అతను పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ముందు సంతోష్ ఫిర్యాదును ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అతను ఎస్పీని కలిసి జరిగిందంతా వివరించాడు. ఈ కేసులో లోతుగా విచారించాల్సి ఉందని నిందితులను పట్టుకుంటామని తెలిపారు.