వ‌ధూవ‌రుల లిప్ కిస్.. చావ‌బాదిన బంధువులు

bride and groom kiss leads to ruckus in marriage ceremony

Marriage: ఆనందంగా సాగుతున్న పెళ్లి వేడుక ఉన్న‌ట్టుండి యుద్ధ భూమిగా మారింది. ఇందుకు కార‌ణం వ‌ధూవరులు స్టేజ్‌పై లిప్ కిస్ ఇచ్చుకోవ‌డ‌మే. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. హ‌పూర్ జిల్లాలోని అశోక్ న‌గ‌ర్‌కు చెందిన ఓ జంట‌కు పెళ్లి నిశ్చ‌యం అయ్యింది. పెళ్లి వేడుక స‌మ‌యంలో వ‌ధూవ‌రులు మాల‌లు మార్చుకున్నారు. ఆ త‌ర్వాత వ‌రుడు వ‌ధువుకి లిప్ కిస్ ఇచ్చాడు. అది చూసిన వ‌ధువు కుటుంబీకులు స్టేజ్ మీద‌కు ఎక్కి వ‌రుడిని చావ‌బాదారు.

దాంతో వారు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వ‌ధువే ముద్దు పెట్టాల‌ని బ‌ల‌వంతం చేసింద‌ని వ‌రుడు కుటుంబీకులు.. కాదు వ‌రుడే బ‌ల‌వంతంగా ముద్దు పెట్టాడ‌ని వ‌ధువు కుటుంబీకులు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. దాంతో పెళ్లి వేడుక కాస్తా ఆగిపోయింది.