Karnataka elections: BJP నేత‌కు ప్ర‌చారం చేస్తున్న బ్ర‌హ్మానందం

Karnataka: క‌ర్ణాటక ఎన్నిక‌లు(karnataka elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ రోజుకో ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది. క‌మెడియ‌న్‌గా ఎంద‌రో అభిమానుల‌ను సొంతం చేసుకున్న న‌టుడు బ్ర‌హ్మానందం..(brahmanandam) బీజేపీ(bjp) నేత సుధాక‌ర్‌కు(sudhakar) ప్ర‌చారం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న బ్ర‌హ్మీ.. క‌ర్ణాట‌క‌లోని చిక్క‌బ‌ళ్లాపూర్‌లో(chikkaballapur) కారెక్కి ప్ర‌చారం చేస్తూ క‌నిపించారు. చిక్క‌బ‌ళ్లాపూర్‌లో తెలుగువారి సంఖ్య ఎక్కువ. కాబ‌ట్టి బ్ర‌హ్మీ చేత ప్ర‌చారం చేయిస్తే ఎక్కువ ఓట్లు ప‌డ‌తాయ‌ని సుధాక‌ర్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

సుధాక‌ర్ బీజేపీ త‌ర‌ఫున క‌ర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేకాదు..సినీ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు(jr ntr) సుధాక‌ర్ చాలా క్లోజ్‌. బెంగ‌ళూరు హాస్పిట‌ల్‌లో తార‌క‌ర‌త్న‌ను(tarakaratna) చూసేందుకు తార‌క్(jr ntr) వెళ్లిన‌ప్పుడు కూడా ఆయ‌న్ను సుధాక‌ర్ రిసీవ్ చేసుకున్నారు. అలా ఎన్టీఆర్‌, బ్ర‌హ్మానందంల పాపులారిటీని అడ్డుపెట్టుకుని గెలిచారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ సుధాక‌ర్ కోసం బ్ర‌హ్మానందం ప్ర‌చారం చేసారు. అయితే..త‌మ అభిమాన న‌టుడు అయిన బ్ర‌హ్మీ ఇలా రాజ‌కీయ ప్ర‌చారాల్లో పాల్గొన‌కుండా ఉంటే ప్ర‌జ‌ల్లో అభిమానం ఉంటుంద‌ని, లేదంటే ఆయ‌న్ను కూడా రాజ‌కీయ నాయ‌కుల‌కు వ‌త్తాసు ప‌లికే వ్య‌క్తిగా చూడాల్సి వ‌స్తుంద‌ని ప‌లువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.