పోర్న్‌కి అల‌వాటు ప‌డి సోద‌రిపై అత్యాచారం.. స‌హ‌క‌రించిన తల్లి

boy rapes sister after watching porn

Viral News: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. క‌న్న‌బిడ్డ మ‌రో బిడ్డ‌ను దారుణంగా రేప్ చేసి చంపేస్తే.. పోలీసుల‌కు చెప్ప‌కుండా ఆ హత్య‌ను దాచేందుకు ప్ర‌య‌త్నించింది ఓ తల్లి. రేవా ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలుడు త‌న ఫోన్‌లో పోర్న్ వీడియోలు ఎక్కువ‌గా చూసేవాడు. ఈ విష‌యం బాలుడి త‌ల్లికి కూడా తెలుసు. త‌ప్ప‌ని మంద‌లించాల్సిపోయి ప‌ట్టించుకోలేదు. దాంతో వారం రోజుల క్రితం ఆ బాలుడు సొంత సోద‌రినే అత్యాచారం చేసాడు. ఈ విష‌యాన్ని తండ్రికి చెప్తాన‌ని ఆ అమ్మాయి బెదిరించ‌డంతో గొంతు నులిమి చంపేసాడు.

ఆ త‌ర్వాత ప‌క్క‌నే నిద్రిస్తున్న త‌ల్లిని లేపి విష‌యాన్ని చెప్పాడు. ఆమె వెంట‌నే లేచి చూడ‌గా.. ఆ అమ్మాయి కొన ఊపిరితో క‌నిపించింది. దాంతో మ‌ళ్లీ గొంతు నులిమి చంపేసింది. ఆ త‌ర్వాత మిగ‌తా ఇద్ద‌రు అక్క‌చెల్లెళ్ల‌కు కూడా విష‌యం తెలీడంతో బాలిక మృతదేహాన్ని ఇంటి వెనుక పాతేసి ఏమీ తెలీన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. వారు ఇల్లు మొత్తం ప‌రిశీలించ‌డంతో అస‌లు నిందితులు ఇంట్లో వారే అని తెలిసి.. బాలుడిని అత‌ని త‌ల్లి, ఇద్ద‌రు అక్క‌చెల్లెళ్ల‌ని అదుపులోకి తీసుకున్నారు.