బాలుడిపై అత్యాచారం.. రక్తమోడుతూ కనిపించిన వైనం
Mumbai: దేశంలో ఆడపిల్లలకే అనుకున్నాం మగపిల్లలకు కూడా రక్షణ లేకుండాపోతోంది. ఓ వ్యక్తి పీకల దాకా తాగి 14 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసాడు. ఆ బాలుడి ప్రైవేట్ భాగం నుంచి రక్తమోడుతూ కనిపించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక గోవండి ప్రాంతానికి చెందిన ఆ బాలుడు రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో బాలుడి ప్రైవేట్ భాగం నుంచి రక్తం కారుతుండడంతో బాలుడి తల్లి ఏం జరిగిందో అని కంగారుపడింది. ఏం జరిగింది అని అడగ్గా.. ఆ బాలుడు ఏడుస్తూ అకో అనే వ్యక్తి తనను కూరగాయలు కొందాం అని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసహజ లైంగిక చర్యకు పాల్పడినట్లు చెప్పాడు.
వెంటనే ఆ అకో అనే వ్యక్తి కోసం గాలిస్తుండగా.. అతను తాగిన మైకంలో కనిపించాడట. తన బిడ్డను ఏం చేసావు అని అడగ్గా.. నేను తాగి ఉన్నాను. అందుకే రేప్ చేసాను అని చెప్పాడు. దాంతో స్థానికులు ఆ వ్యక్తిని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. బాలుడిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి బాలేదు. షాక్‌లో ఉన్నాడని త్వరలో కోలుకుంటాడని వైద్యులు వెల్లడించారు.