Delhi: 60 సార్లు పొడిచి.. శవంపై ఎక్కి డ్యాన్స్..!

ఢిల్లీలో (delhi) దారుణం చోటుచేసుకుంది. ఓ 16 ఏళ్ల కుర్రాడు 18 ఏళ్ల యువ‌కుడిని దారుణంగా క‌త్తితో పొడిచి చంప‌డ‌మే కాకుండా డ్యాన్స్ చేస్తున్న వీడియో స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వెల్కం అనే ప్రాంతంలో మంగ‌ళ‌వారం రాత్రి ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఆ బాలుడు బాధితుడి నుంచి డ‌బ్బు దొంగ‌త‌నం చేస్తూ ప‌ట్టుబ‌డ్డాడ‌ని త‌ప్పించుకునేందుకు ముందు గొంతు నులిమి ఆ త‌ర్వాత ఏకంగా 60 సార్లు పొడిచి చంపాడ‌ని తెలిపారు. ఆ త‌ర్వాత శవంపై ఎక్కి డ్యాన్సులు వేసి పారిపోయిన‌ట్లు పేర్కొన్నారు. నిన్న మ‌ధ్యాహ్నానికి నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.