లైంగిక దాడి భరించలేక 50 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బాలుడు
Viral News: 50 ఏళ్ల వ్యక్తి ఓ 15 ఏళ్ల బాలుడి ద్వారా తన లైంగిక వాంఛలు తీర్చుకుంటూ బాలుడి జీవితాన్ని నాశనం చేసాడు. పలుమార్లు తనపై అసహజ శృంగారానికి పాల్పడటంతో ఆ బాధను భరించలేక ఆ బాలుడు అతన్ని చంపేసాడు.
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. “” చాలా కాలంగా ఆ బాలుడి పట్ల నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అంతటితో ఆగకుండా వీడియోలు రికార్డు చేస్తూ తన స్నేహితులకు చూపించి పైశాచికానందం పొందేవాడు. తల్లిదండ్రులకు చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడి మరీ బాలుడితో అసహజ శృంగారానికి పాల్పడేవాడు. ఈ బాధ భరించలేక తన గదిలో ఉన్న షార్ప్ వస్తువుతో గొంతులో పొడిచేసాడు. అతను మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్నాడని మాకు సమాచారం అందింది. ప్రస్తుతం బాలుడికి వైద్య పరీక్షలు చేయించి జువైనైల్ హోంకి తరలించాం “” అని తెలిపారు.