హెయిర్ కట్ అంటే భయమట.. బాలుడికి వింత సమస్య
పై ఫోటోలో ఉన్న బుడ్డోడిని చూసారా..! చూడటానికి ముద్దుగా ఉన్నాడు కానీ ఆ జుట్టేంటి అనుకుంటున్నారా? ఈ బాలుడికి జుట్టు కత్తిరించుకోవాలంటే భయమట. వీడు ఊహ తెలిసినప్పటి నుంచి అసలు జుట్టు కత్తిరించుకోలేదట. దాంతో ఇలాగే స్కూల్‌కి వెళ్తుండడంతో టీచర్లు, తోటి విద్యార్ధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీట్‌గా హెయిర్ కట్ చేసుకుని రా లేదంటే స్కూల్ మానేయ్ అని హెచ్చరించారట. దాంతో ఈ బాలుడు యూకేలో తెగ వైరల్ అయిపోయాడు.
వైద్యులకు చూపిస్తే.. ఈ బాలుడికి టాన్సూర్ ఫోబియా ఉందని తేల్చేసారు. టాన్సూర్ అంటే గుండు గీకించుకోవడం. పాపం వాడి బాధను చూసి తల్లి మనసు అల్లాడిపోతోంది. కావాలంటే పోనీ కట్టి స్కూల్‌కి పంపిస్తామని యాజమాన్యాన్ని వేడుకున్నా వారు ఒప్పుకోలేదు. దాంతో వీడికి మరే స్కూల్‌లోనూ అడ్మిషన్ ఇవ్వడంలేదట. వీడికి ఇన్‌స్టాగ్రామ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. 2.5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. కానీ పాపం ఈ భయం వల్ల వాడి చదువు ఆగిపోతోందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.