పోర్న్ చూసి.. సోదరిని గర్భవతిని చేసి..
Viral News: ముంబైలో నీచమైన ఘటన చోటుచేసుకుంది. పోర్న్‌కి అలవాటు పడిన మైనర్ బాలుడు సోదరి ద్వారా తన లైంగిక వాంఛను తీర్చుకున్నాడు. ఫలితంగా మైనర్ అయిన బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసే సరికి బాలిక మూడు నెలల గర్భవతి. దాంతో విషయం బయటికి తెలీకుండా గర్భం తీయించేయాలని అనుకున్నారు.
ప్లాన్ ప్రకారం దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో విషయం బయటపడింది. ఇద్దరూ కలిసి పోర్న్ చూసేవారని దాని ఫలితమే ఇదని విచారణలో తేలింది. బాలికకు మూడు నెలల నుంచి నెలసరి రాకపోవడంతో విషయం తల్లికి తెలిసింది. దాంతో ఈ కేసును శిశు సంక్షేమ కమిషన్‌కు తరలించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు సోదరులు మైనర్ అయిన సోదరిపై అత్యాచారం చేసారు. దాంతో బాలిక గర్భం దాల్చింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి నీచమైన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. రోజుకో కేసు బయటికి వస్తున్నా ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది.