పిల్లాడినీ వదలని కామాంధులు
Gangrape: ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా రక్షణ లేకుండాపోతోంది అని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ ఐదేళ్ల బాలుడిపై నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘోర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హపూర్ జిల్లాకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు ఒంటిపై గాయాలతో ఇంటికి వెళ్లాడు. ఏం జరిగిందని తల్లిదండ్రులు అడగ్గా తన పట్ల ఇద్దరు వ్యక్తులు చేసిన దారుణాన్ని వివరించాడు. అర్షద్, జునైద్ అనే ఇద్దరు వ్యక్తులు తనను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లి ఓ పొలంలో గ్యాంగ్ రేప్ చేసారట. అక్కడే ఉన్న మరో ఇద్దరు గొర్రె కాపరులు ఈ దారుణాన్ని ఆపకుండా వీడియోలు తీసినట్లు వెల్లడించాడు.
దాంతో వెంటనే బాలుడి తల్లిదండ్రులు నిందితుల ఇంటికి వెళ్లి గొడవ వేసుకోగా.. వారిపై కూడా దాడికి దిగారు. పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో బాలుడి బంధువు ఒకరు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది. నలుగురు వ్యక్తులపై పోక్సోతో పాటు మరో మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని బాలుడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి పంపించారు.