Train Accident: చేతులు కడుగుతుండగా.. క్షణంలో ప్రాణం పోయింది
Mumbai: పట్టాలపై రైలు వస్తోందని కూడా గమనించకుండా వంగి మరీ చేతులు కడుగుతూ క్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు (train accident). ఈ ఘటన ముంబై- మలాడ్ రైల్వే స్టేషన్లో (mumbai-malad railway station) చోటుచేసుకుంది. మయాంక్ అగర్వాల్ అనే 17 ఏళ్ల కుర్రాడితో పాటు మరో కుర్రాడు రైల్వే పట్టాలపై వంగి మరీ చేతులు కడుగుతూ నిలబడ్డారు. క్షణంలోనే రైలు వేగంగా వచ్చి మయాంక్‌ను ఢీకొట్టింది. బాటిల్‌తో సహా అతని మృతదేహం ప్లాట్‌ఫాంపై ఎగిరిపడింది. మరో యువకుడు తృటిలో తప్పించుకున్నాడు. అక్కడి సీసీటీవీల్లోఈ భయానక దృశ్యం రికార్డ్ అయింది. అందుకే రైల్వే స్టేషన్లో ఆచి తూచి వ్యాహరిస్తూ ఉండాలి. ముఖ్యంగా పట్టాల దగ్గర అప్రమత్తంగా ఉంటే ఇలాంటివే జరుగుతుంటాయి.