Viral News: స్విమ్మింగ్ చేసాడు.. చ‌నిపోయాడు

boy dies after coming out of swimming pool

Viral News: ఓ యువ‌కుడు కాసేపు స‌రదాగా స్విమ్మింగ్ చేసి పూల్ నుంచి బ‌య‌టికి రాగానే కుప్ప‌కూలిపోయాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మీర‌ఠ్‌లో చోటుచేసుకుంది. స్థానిక సీసీటీవీలో ఈ ఘ‌ట‌న రికార్డ్ అవ‌డంతో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. 15 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ చేసి పూల్ నుంచి బ‌య‌టికి రాగానే ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయాడు. ఆ త‌ర్వాత అక్క‌డే ఉన్న కొంద‌రు వ్య‌క్తులు వెంట‌నే బాలుడిని స్థానిక హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌గా అప్ప‌టికే చ‌నిపోయినట్లు తెలిపారు. దాంతో వారు పోలీసుల‌కు సమాచారం అందించారు. ఈ ఘ‌ట‌న‌తో స్విమ్మింగ్ పూల్ మేనేజ‌ర్ ప‌రార‌య్యాడు. పూల్‌ను సీజ్ చేసేసారు. సీసీటీవీ ఆధారంగా ఏం జ‌రిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.