Bournvita తాగేవారికి గుడ్ న్యూస్..!

Bournvita: ప్ర‌ముఖ డ్రింక్ మిక్స్ అయిన బోర్న‌విటా తాగేవారికి ఓ గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పేముందు మీరు ఒక విష‌యం తెలుసుకోవాలి. అదేంటంటే.. బోర్న‌విటాలోని ప్ర‌తి 100 గ్రాముల పౌడ‌రులో 37.4 గ్రాముల వైట్ షుగ‌ర్‌ని వినియోగించి ప్యాకింగ్ చేసేవారు. ఈ డ్రింక్ పిల్ల‌లు ఎక్కువ‌గా తాగుతుంటారు కాబ‌ట్టి వారికి అంత మోతాదులో వైట్ షుగ‌ర్ అంటే ఆరోగ్యానికి మంచిది కాదు.

ఈ విష‌యాన్ని ఫుడ్ ఫార్మ‌ర్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్స‌ర్ ఒక‌రు బ‌య‌ట‌పెట్టారు. పిల్ల‌లు తాగే ఈ డ్రింక్‌లో ఇంత మోతాదులో చెక్క‌ర ఉంటే వారి ఆరోగ్యానికి భ‌రోసా ఏది అని పెద్ద రాద్దాంతం చేసాడు. ఈ వీడియో చూసిన బోర్న‌విటా సంస్థ దిగొచ్చింది. బోర్న‌విటాలో ప్ర‌తి 100 గ్రాముల పౌడ‌రులో ఉండే 37.4 గ్రాములు ఉండే చెక్క‌ర‌ను కాస్తా 32.2 గ్రాముల‌కు త‌గ్గించింది. ఈ విష‌యాన్ని బోర్న‌విటా సంస్థ ప్ర‌క‌టించ‌డంతో ఆ ఇన్‌ఫ్లుయెన్స‌ర్ ఆనందానికి అవ‌ధుల్లేవు. సోష‌ల్ మీడియాలో క్రింజ్ వీడియోలు, సోది చెప్పేవారి కంటే ఇలా న‌లుగురికీ ఉప‌యోగ‌ప‌డే రీల్స్ చేయ‌డం నిజంగా అభినంద‌నీయం క‌దూ..!

https://www.instagram.com/reel/C1MS_Uhriv0/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==