“నీ తండ్రి చచ్చినా పనికి రావాల్సిందే”
Viral News: తండ్రి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఏమీ చేయలేని స్థితిలో ఉంది ఆ అమ్మాయి. చివరికి తండ్రిని కోల్పోయి ఎంతో దుఖంలో ఉంటే.. నీ తండ్రి చచ్చినా సరే నువ్వు పనికి రావాల్సిందే అని బాస్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి ఆమె మరింత దుఖానికి లోనైంది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ఓ యువతి తన బాధను వెల్లడిస్తూ రెడిట్ యాప్‌లో పంచుకుంది. “” మా నాన్నకు చాలా సీరియస్ అయింది. దాంతో ఆయన మూడు రోజుల పాటు ఐసీయూలో ఉండి చనిపోయారు. దాంతో నేను పనికి వెళ్లలేకపోయాను. నా వల్ల పని ఆగిపోయిందని బాస్ నుంచి నాకొక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటో మీరే చూడండి “” అని పేర్కొంది.
ఇంతకీ బాస్ పెట్టిన మెసేజ్ ఏంటి?
“” నీది గ్రూమింగ్ రోల్. అలాంటప్పుడు నువ్వు రోజూ పనికి రావాల్సి ఉంటుంది. నువ్వు ఒక్కరోజు రాకపోయినా కూడా చాలా కష్టం. నీకు ఏ పని నప్పుతుందో దానినే ఎంచుకో. జీవితంలో అందరికీ కష్టాలు ఉంటాయి. అయినా కూడా పనికి రోజూ రావడం అనేది చాలా కీలకం. నేను ఇలాంటి విషయాలు మెసేజ్‌లలో మాట్లాడను. కానీ ఈ విషయంలో మెసేజ్ మాత్రమే బెస్ట్ ఆప్షన్ అనిపించింది “” అని పేర్కొన్నాడు.
ఈ పోస్ట్ చూసాక నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి దరిద్రుడిని ఉరి తీసినా పాపం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు ఇతర ఉద్యోగ అవకాశాలు ఉంటే సాయం చేస్తామని హామీ ఇస్తున్నారు.
ALSO READ: బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్న భర్త.. భార్య ఆత్మహత్య