రేప్ కేసులో సంచలన తీర్పు.. తప్పు అమ్మాయిదేనన్న న్యాయస్థానం
Bombay High Court: ఓ రేప్ కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తప్పు అమ్మాయిదేనంటూ నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. అసలేం జరిగిందంటే.. ముంబైకి చెందిన ఓ యువతి అక్టోబర్ 2017లో తనపై ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన కుర్రాడు హోటల్ రూంకి పిలిచి రేప్ చేసాడంటూ ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఎట్టకేలకు ఈరోజు న్యాయమూర్తి తీర్పు వెల్లడిస్తూ నిందితుడిని తప్పు లేదని నిర్దోషిగా ప్రకటించడం బాధితురాలిని విస్మయానికి గురిచేసింది.
తీర్పులో న్యాయమూర్తి లేవనెత్తిన అంశాలివే
ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన అబ్బాయితో అంత చనువేంటి?
పిలవగానే హోటల్ రూంకి ఎలా వెళ్లిపోయావ్?
పైగా నువ్వు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆ హోటల్ బిజీ ప్రాంతంలోనే ఉంది. నీపై ఆ అబ్బాయి అత్యాచారం చేస్తున్నప్పుడు నువ్వు చిన్నగా అరిచినా కూడా అందరికీ వినపడే అవకాశం ఉంది. మరి నువ్వెందుకు అరవలేదు?
మార్చి 2017లో ఆ అబ్బాయి నీ నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే నువ్వెందుకు అక్టోబర్‌లో ఫిర్యాదు చేసావు? అప్పటివరకు ఏం చేసావు?
ఇవన్నీ చూస్తుంటే మీ ఇద్దరి మధ్య జరిగినదంతా పరస్పర అంగీకారంతోనే జరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ కేసులో ఆ అబ్బాయిని నిర్దోషిగా ప్రకటిస్తున్నాను అని వెల్లడించారు.