High Court: సెక్స్ చేస్తున్నట్లున్న పెయింటింగ్స్ అన్నీ అసభ్యకరం కావు
High Court: పెయింటింగ్స్ విషయంలో బొంబాయ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. FN సౌజా, అక్బర్ పదంసీ అనే ఇద్దరు ప్రముఖ కళాకారులు గీసిన పెయింటింగ్‌లను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ సీజ్ చేసింది. ఇందుకు కారణం.. ఆ పెయింటింగ్స్‌లో ఓ జంట సెక్స్ చేస్తున్నట్లుగా ఉండటమే. ఇలా దాదాపు 7 పెయింటింగులను సీజ్ చేసారు.
సౌజా, పదంసీ వేసే పెయింటింగ్స్‌కి మంచి గిరాకీ ఉంది. ఎందుకంటే వీరు యూరోపియన్ స్టైల్ పెయింటింగ్స్ ఎక్కువగా వేస్తుంటారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త ముస్తఫా కరాచీవాలా ఈ పెయింటింగ్స్‌ని స్కాట్‌ల్యాండ్, లండన్‌లో వేలానికి పెడితే తాను అధిక ధరకు దక్కించుకున్నారు. ఆ పెయింటింగ్స్‌ని తిరిగి ముంబైకి తెచ్చుకున్న సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు ఇంత అసభ్యకరంగా ఉన్నాయేంటి అంటూ వాటిని సీజ్ చేసారు. దాంతో ఆయన కోర్టుకెక్కారు.
దీనిపై ముస్తఫా బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. ఈరోజు తీర్పు వెల్లడించింది. పెయింటింగ్‌లో సెక్స్ చేస్తున్నట్లు చూపించినంత ప్రతీదీ అసభ్యకరం కాదని.. అది చూసే కళ్లని బట్టి ఉంటుందని కస్టమ్స్ అధికారులకు చీవాట్లు పెట్టింది. వెంటనే ఆ పెయింటింగ్స్‌ని యజమానులకు ఇచ్చేయాలని ఆదేశించింది.