కండోమ్ కంపెనీ య‌జ‌మాని బంప‌ర్ ఆఫ‌ర్.. ఆయ‌న క్రెడిట్ కార్డుతో మ‌నం షాపింగ్ చేయ‌చ్చు..!

Bold Care founder bumper offer to netizens

Bold Care: బోల్డ్ కేర్ అనే కండోమ్ కంపెనీ య‌జ‌మాని రాహుల్ కృష్ణ‌న్ నెటిజ‌న్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. త‌న క్రెడిట్ కార్డు వివ‌రాల‌ను ట్విట‌ర్‌లో పోస్ట్ చేసి.. త‌న‌ కార్డు వాడుకుని షాపింగ్ చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించాడు. అయితే.. త‌న కార్డు వాడాల‌నుకునేవారు రూ.1000 వ‌ర‌కు మాత్ర‌మే ఖ‌ర్చు చేయాల‌ని.. ఓటీపీ రిక్వెస్ట్‌ని త‌న క్రెడిట్ కార్డు వివ‌రాలు పెట్టిన ట్వీట్ కింద ట్వీట్ చేస్తేనే చెప్తాన‌ని చిన్న కండీష‌న్ పెట్టాడు.

ఇంక మ‌న‌వాళ్లు ఆగుతారా..! వ‌రుస పెట్టిన OTP మెసేజ్‌లు రావ‌డం మొద‌లుపెట్టాయి. రాహుల్ కూడా ఓటీపీలు ట్విట‌ర్ ద్వారానే వెల్ల‌డించాడు. అయితే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్ర‌కారం ఓటీపీని ఎవ్వ‌రితోనూ షేర్ చేసుకోకూడ‌దు. అలాంటిది రాహుల్ బ‌హిరంగంగా ట్విట‌ర్ ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేయ‌డంతో వంద ట్రాన్స్‌సాక్ష‌న్ల‌కే అత‌ని కార్డు బ్లాక్ అయ్యింది. అయితే రాహుల్ ఎందుకు ఈ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారో మాత్రం వెల్ల‌డించ‌లేదు.

Bold care rahul krishnan