Board Exams: ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
ఇంటర్ (intermediate) మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఏడాదిలో రెండు సార్లు బోర్డ్ ఎగ్జామ్స్ (board exams) నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. విద్యార్థులు రెండు భాషలు తప్పనిసరిగా చదవాలని వెల్లడించింది. ఆ రెండు భాషల్లో ఒకటి భారతీయ భాష అయివుండాలని స్పష్టం చేసింది. 2024 విద్యా సంవత్సరానికి టెక్ట్స్ బుక్స్ డెవలప్ చేస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి విద్యా వ్యవస్థలోని కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. విద్యార్థులు పరీక్షల్లో బెస్ట్ మార్కులు తెచ్చుకునేందుకు ఈ రెండు సార్ల బోర్డు పరీక్షల విధానం ఉపయోగపడుతుందని కేంద్ర విద్యాశాఖ అభిప్రాయపడింది.
దీని వల్ల ఉపయోగమేంటి?
ఇలా ఏడాదిలో రెండు సార్లు బోర్డ్ పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రిపేర్ అవ్వడానికి విద్యార్థులకు సమయం దొరుకుతుంది. అంతేకాదు.. వారు ఏ సబ్జెక్టుల్లో సిద్ధంగా ఉన్నారో అవే సబ్జెక్టుల్లో ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాయచ్చు. మిగతా సబ్జెక్టులను రెండో బోర్డ్ ఎగ్జామ్‌లో రాసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరీక్షా విధానంలో కేవలం తరగతి గదుల్లో, పుస్తకాల్లో ఉన్నది బట్టీ పట్టి రాయడానికి మాత్రమే ఉందని.. పరీక్షల ప్రధాన గోల్ అది కాదని కేంద్రం తెలిపింది. (board exams) బోర్డు పరీక్షలు విద్యార్థుల సామర్ధ్యాన్ని తెలుసుకోగలిగేలా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలా ఏడాదికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్ అనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతున్నారు.