Twitter: కేవ‌లం వారికే బ్లూ టిక్‌..!

Hyderabad: కొన్ని రోజుల క్రితం ట్విట‌ర్(twitter) ఓన‌ర్ ఎలాన్ మ‌స్క్(elon musk) అంద‌రికీ బ్లూ టిక్స్(blue tick) యాక్సెస్ తీసేసి షాక్ ఇచ్చాడు. సినీమా స్టార్ల నుంచి పొలిటిషియ‌న్లు, క్రికెట‌ర్ల వ‌ర‌కు టాప్ సెల‌బ్రిటీల ఎకౌంట్స్‌కు బ్లూ టిక్స్ మాయ‌మైపోయాయి. బ్లూ టిక్ కావాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుని కొనుక్కోవాల్సిందేన‌ని తెలిపాడు. కొంద‌రు సెల‌బ్రిటీలు మ‌స్క్ నిర్ణ‌యంపై మండిప‌డ్డారు. బ్లూ టిక్ లేక‌పోయినంత మాత్రాన త‌మ స్టేట‌స్ ప‌డిపోద‌ని, అన్ని డాల‌ర్లు పెట్టి కొనుక్కోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌స్క్ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. 1 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు ఉన్న ఎకౌంట్ల‌కు మాత్ర‌మే బ్లూటిక్ ఫ్రీగా ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. వెబ్‌సైట్ నుంచి బ్లూ టిక్ కొనుగోలు చేయాలంటే నెల‌కు 8 డాల‌ర్లు చెల్లించాలి. అదే యాప్ నుంచి కొనుక్కోవాలంటే నెల‌కు 11 డాల‌ర్లు చెల్లించాల్సి ఉంటుంద‌ట‌.