Nandyal: కేబుల్ టీవీలో బ్లూ ఫిలింస్

blue films aired on cable tv in nandyal

Nandyal: కేబుల్ టీవీలో బ్లూ ఫిలింస్ రావ‌డంతో ప్ర‌జ‌లు షాకయ్యారు. ఈ ఘ‌ట‌న నంద్యాల‌లో చోటుచేసుకుంది. నందికొట్కూరులో ఫిరోజ్ సిటీ కేబుల్ నిర్వాహకులు ప్రైవేటుగా వీడియోలు చూద్దామనుకుని పొరపాటుగా ఛానెల్స్‌లో ప్లే చేసేసార‌ట‌. దీంతో ఆ ఛానల్ పెట్టిన వందలాది మందికి అసభ్యకర దృశ్యాలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 10 ని.ల పాటు నీలి చిత్రాలు ప్రదర్శితమయ్యాయని పేర్కొన్నారు. పోలీసులు ముగ్గురు యజమానులపై కేసు నమోదు చేశారు.