ముస్లింతో కూతురి పెళ్లి రద్దు చేసిన BJP నేత..!
Uttarakhand: సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముస్లింతో(muslim) కూతురి పెళ్లిని క్యాన్సిల్ చేసారు ఓ బీజేపీ(bjp) నేత. ఈ ఘటన ఉత్తరాఖండ్(uttarakhand)లో చోటుచేసుకుంది. పౌరీ గడ్వాల్ ప్రాంతానికి చెందిన యష్పాల్ బెనామ్ అనే బీజేపీ నేత.. తన కూతురు ప్రేమించిన ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో కార్డులు కూడా పంచేసారు. శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదురయ్యాయి. భజరంగ్ దళ్(bajrang dal) నుంచి సామాన్య ప్రజల వరకు ఆయనకు వ్యతిరేకత ఎదురైంది. దాంతో వెంటనే పెళ్లి రద్దు చేసారు. ఈ విషయంలో తాను పబ్లిక్ మనోభావాలను గౌరవించాలనుకుంటున్నానని, తన కూతురి పెళ్లి పోలీసుల సమక్షంలో జరగడం తనకు ఇష్టం లేదని తెలిపారు. అయితే వరుడి కుటుంబ సభ్యులతో చర్చించాకే తాత్కాలికంగా పెళ్లి రద్దు చేసినట్లు తెలిపారు.
ఓ పక్క వివాదాస్పదంగా మారిన ది కేరళ స్టోరీ(the kerala story) సినిమాకు బీజేపీ పూర్తిగా మద్దతు తెలిపింది. అన్ని రాష్ట్రాల్లో సినిమాను ప్రదర్శించాలని కేంద్రం నిర్ణయించింది. లవ్ జిహాద్ కాన్సెప్ట్‌తో తీసిన రియల్ లైఫ్ స్టోరీ అయిన ఈ సినిమాకు బీజేపీ సపోర్ట్ చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన హిందూ ఎమ్మెల్యే.. ముస్లింకు పిల్లనిచ్చి పెళ్లచేయాలనుకోవడం చర్చకు దారి తీసింది.