ఖైదీని వైన్ షాప్‌కు తీస్కెళ్లిన పోలీస్!
Bihar: ఓ ఖైదీని(prisoner) వైన్ షాప్‌కు తీస్కెళ్లిన ఘటన బీహార్(bihar police)లో చోటుచేసుకుంది. హామీర్‌పుర ప్రాంతంలో ఈరోజు ఉదయం ఓ పోలీస్ ఖైదీతో కలిసి వైన్ షాప్ ముందు నిలబడిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెక్షన్ 151 కింద బుక్కైన ఆ నిందితుడిని పోలీస్ కోర్టుకు తీసుకెళ్తుండగా మద్యం కావాలని అడగడంతో వ్యాన్ ఆపి మరీ ఖైదీని షాప్‌కు తీసుకెళ్లారట. ఖైదీ చేతికి సంకెళ్లు లేకపోగా తాడు కట్టి ఉంది. ఆ తాడుని పోలీస్ పట్టుకుని అతను మద్యం కొని తాగే వరకు అక్కడే ఉన్నాడు. దాంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వారి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దాంతో బిహార్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్‌పై వేటు వేసింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. గతంలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్‌లో చెకప్ కోసం నిందితుడిని తీసుకెళ్తుండగా.. నలుగురు పోలీసులు అతన్ని షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లారు. దాంతో ఆ నలుగురిని సస్పెండ్ చేసారు.