Bihar: దారుణం.. మృతదేహాన్ని కాలువలో పడేసిన పోలీసులు
బీహార్లో (bihar) దారుణం జరిగింది. రోడ్డుపై పడి ఉన్న మృతదేహాన్ని అక్కడి పోలీసులు కాలువలో పడేసారు. స్థానిక ముజాఫర్పూర్లో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రమాదంలో ఛిద్రమైన మృతదేహాన్ని పోలీసులే కాలువలో పడేశారు. పోలీసులు ఈ దారుణానికి పాల్పడుతున్న సమయంలో ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో ఎస్పీ స్పందించి డెడ్ బాడీని వెలికి తీయించారు. ఘటనకు బాధ్యులైన కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. మృతదేహం ఎవరిదో గుర్తించి.. పోస్టుమార్టానికి పంపినట్లు ఎస్పీ తెలిపారు.