Love Marriage: 19 ఏళ్లకే లేచిపోవడాలు.. వార్నింగ్‌లు!
Bihar: టీన్ ఏజ్‌లోనే ఇంట్లో నుంచి లేచిపోవడాలు.. ఎదిరిస్తే తల్లిదండ్రులకే వార్నింగ్‌లు ఇవ్వడాలు ఎక్కువైపోయాయి (love marriage). తాజాగా బిహార్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 19 ఏళ్ల ఖుషి కుమార్ అనే యువతి.. తను ప్రేమంచిన వాడితో ఇంట్లో నుంచి లేచిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఇంట్లోవారు వద్దు అని హెచ్చరిస్తున్నారని వారికి ఏకంగా వీడియో కాల్ ద్వారా వార్నింగ్ ఇచ్చింది. పెళ్లయ్యాక వీడియో రికార్డ్ చేసి ఎవరైనా తన మీద కానీ తన భర్త మీద కానీ చెయ్యి వేయాలని చూస్తే ఇంట్లో వారందరినీ కోర్టుకు లాగుతానని వార్నింగ్ ఇచ్చింది.
” ముందే చెప్తున్నా. నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నా. నా భర్త బెదిరించి మరీ నన్ను పెళ్లి చేసుకున్నట్లు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా.. ఆయనపై ఎటాక్ చేయాలని చూసినా ఎవ్వరినీ వదిలిపెట్టను. నేను ఎంత మొండిదాన్నో మీకు బాగా తెలుసు. మా జోలికి వస్తే అందరినీ కోర్టుకు లాగుతాను “అని వీడియో ద్వారా వార్నింగ్ ఇచ్చింది. మరో దారుణం ఏంటంటే.. ఖుషి కుమారి ప్రేమించిన అబ్బాయికి ఇలా లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. అయినా కూడా రాకపోతే సూసైడ్ చేసుకుంటానని ఆ అబ్బాయిని బలవంతంగా ఒప్పించి మరీ గుడిలో తాళి కట్టించుకుంది. అసలు ఈ వయసులో ఏం ఉద్యోగాలు చేసి ఏం తింటారో వారికే తెలియాలి. (love marriage)