Banglore Rave Party: రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్
Banglore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డ నటి హేమ పోలీసులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజు ఆమె విచారణకు బెంగళూరు రావాల్సిందిగా నోటీసులు పంపగా.. తనకు వైరల్ ఫీవర్ ఉందని విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని లేఖ రాసారు. అయితే ఈ లేఖను తప్పించుకోవడానికి హేమ రాసారని.. దీనిని తాము పరిగణించడం లేదని తెలిపారు. హేమ ఇలాగే విచారణ నుంచి తప్పించుకోవాలని చూస్తే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని బలవంతంగా తీసుకెళ్లాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. అసలు తాను ఆ పార్టీలో లేనని.. తాను లేకపోయినా తన పేరు బయట పెట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు నోటీసులు ఎలా పంపుతారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను పారిపోయే రకం కాదని.. న్యాయ పోరాటం చేసి తీరతానని అన్నారు.