BGMI ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్..!
Hyderabad: BGMI ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. రీవాంప్ చేయబడిన వెర్షన్ ఇండియాలో త్వరలో రిలీజ్ అవబోతోంది. పబ్జీకి(PUBG) రీవాంప్డ్ వెర్షనే ఈ బీజీఎంఐ(BGMI). కొన్ని కారణాల వల్ల ఇండియా పబ్జీని బ్యాన్ చేసింది. ఆ తర్వాత పబ్జీని డెవలప్ చేసిన కొరియన్ సంస్థ క్రాఫ్టన్.. ఇండియన్ అథారిటీస్‌తో చర్చలు జరిపి రీవాంప్డ్ వెర్షన్ రిలీజ్‌కు పర్మిషన్ తీసుకుంది. బీజీఎంఐని యాపిల్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి సెక్యూరిటీ రీజన్స్ వల్ల తొలగించేసారు. అయితే పబ్జీ మాత్రం ఇప్పటికీ బ్యాన్‌లోనే ఉంటుంది.
అయితే బీజీఎంఐకు మళ్లీ పర్మిషన్ ఇవ్వాలంటే కొన్ని కండిషన్లకు లోబడి ఉండాలని భారత ప్రభుత్వం క్రాఫ్టన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు క్రాఫ్టన్ కూడా ఒప్పుకుంది. ఈ గేమ్ డౌన్‌లోడ్ చేసుకున్నాక 3 నెలల పాటు ప్రతి రోజూ టైం లిమిట్ తప్పనిసరిగా ఉండాలని భారత ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల పిల్లలు గేమ్‌కు అడిక్ట్ కాకుండా ఉంటారని తెలిపింది. ఇందుకు క్రాఫ్టన్ కూడా ఓకే అనడంతో బీజీఎంఐని మళ్లీ యాప్ స్టోర్, ప్లే స్టోర్‌లోకి తీసుకురానున్నారు.
అంతేకాదు.. గేమ్‌లో ఎలాంటి రక్తపు మడుగులు కనిపించకూడదని స్పష్టం చేసింది. దాంతో బ్లడ్ కలర్‌ను రెడ్ నుంచి గ్రీన్‌గా మార్చేందుకు క్రాఫ్టన్ ఒప్పుకుంది. పబ్జీలాగే బీజీఎంఐకు విపరీతమైన క్రేజ్ ఉంది. బీజీఎంఐను లాంచ్ చేసిన ఏడాదికే 10 కోట్ల డౌన్‌లోడ్లను దాటేసింది. బీజీఎంఐని బ్యాన్ చేసిన తర్వాత వీడియో గేమ్ లవర్స్ అంతా కాల్ ఆఫ్ డ్యూటీకి, గారెనా ఫ్రీ ఫైర్‌కి షిఫ్ట్ అయిపోయారు.