Engineering Student: సారీ నాన్నా.. లోన్ క‌ట్టలేక చ‌నిపోతున్నా

Bengaluru: అమ్మా నాన్నా.. సారీ. తీసుకున్న లోన్ క‌ట్ట‌లేను. అందుకే చ‌నిపోదాం అనుకుంటున్నా అని లెట‌ర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు ఓ ఇంజినీరింగ్ విద్యార్థి (engineering student). బెంగ‌ళూరులోని జ‌ల‌హ‌ళ్లి ప్రాంతంలో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. తేజ‌స్ అనే 22 ఏళ్ల యువ‌కుడు య‌ళ‌హంక‌లోని నిట్టె మీనాక్షి కాలేజీలో ఇంజినీరింగ్ చ‌దువుతున్నాడు. ఇత‌ను కిస్ అండ్ స్లైస్ అనే చైనీస్ లోన్ యాప్ నుంచి లోన్ తీసుకున్నాడు. ఈ విష‌యం ఇంట్లో వాళ్ల‌కు కూడా చెప్ప‌లేదు. అయితే లోన్ తీసుకున్న వారం త‌ర్వాత ఎప్పుడు క‌డ‌తావ్ అంటూ యాప్ ఏజెంట్స్ టార్చ‌ర్ పెట్టేవారు. త్వ‌ర‌లో క‌ట్టేస్తాన‌ని ఎంత చెప్పినా వారు విన‌లేదు. దాంతో వాళ్లు ఏకంగా తేజ‌స్ ఇంటికి వెళ్లి మ‌రీ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. విష‌యం తెలిసి తేజ‌స్ తండ్రి కొంత టైం ఇస్తే ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో మొత్తం డ‌బ్బు క‌ట్టేస్తాన‌ని రిక్వెస్ట్ చేసారు. స‌రేన‌ని వెళ్లిపోయిన ఆ ఏజెంట్లు మాటి మాటికీ ఫోన్లు చేసి బెదిరింపుల‌కు పాల్పడ్డారు. లోన్ క‌ట్ట‌డానికి డ‌బ్బు లేక‌పోవ‌డంతో నిన్న రాత్రి తేజ‌స్ ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరేసుకున్నాడు. దాంతో పోలీసులు ఆ యాప్ ఏజెంట్ల‌పై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.