Job: వింత కారణం చెప్పి ఉద్యోగం ఇవ్వలేదు..!
Bengaluru: స్కిల్స్ లేవనో, ఇంగ్లీష్ రాదనో, ఎగ్జామ్‌లో పాస్ అవ్వలేదనో జాబ్ రాకపోతే ఓ అర్థం ఉంది. కానీ అన్ని రౌండ్ల ఇంటర్వ్యూల్లో పాల్గొని పాస్ అయినప్పటికీ ఓ వింత కారణం చెప్పి ఓ యువతికి ఉద్యోగం ఇవ్వలేదట. ఈ విషయాన్ని ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (job) బెంగళూరుకు చెందిన ప్రతీక్ష అనే యువతి ఇంటర్వ్యూ కోసమని స్థానిక కంపెనీకి వెళ్లింది. మూడు రౌండ్ల ఇంటర్వ్యూ చేసి, ఒక ఎగ్జామ్ పెట్టారు. అన్నింట్లో ప్రతీక్ష పాస్ అయింది. ఇక ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినట్లే అనుకుంటున్న టైంలో ప్రతీక్షకు ఆ కంపెనీ షాక్ ఇచ్చింది. ఉద్యోగానికి కావాల్సిన అన్ని స్కిల్స్ ఉన్నాయి కానీ.. టీంలో ఉన్న ఇతర ఉద్యోగుల కంటే ప్రతీక్ష ఎక్కువ తెల్లగా ఉందని ఆమెను రిజెక్ట్ చేసిందట.
ఈ విషయాన్ని ప్రతీక్ష లింక్డిన్‌లో పోస్ట్ చేస్తూ కంపెనీ పంపిన రిజెక్షన్ మెయిల్ ఫొటో కూడా పెట్టింది. “” డియర్ ప్రతీక్ష. మిమ్మల్ని మా కంపెనీలో తీసుకోలేం. మీరు ఇంటర్వ్యూలో, ఎగ్జామ్‌లో పాస్ అయ్యారు. ఈ రోల్‌కి కావాల్సిన అన్ని స్కిల్స్ మీకు ఉన్నాయి. కానీ మా టీంలో ఉన్నవారికంటే మీరు తెల్లగా ఉన్నారు. సో మీరు జాయిన్ అయితే ఇంటర్నల్‌గా గొడవలు వస్తాయి. అందుకే మిమ్మల్ని తీసుకోలేం. సారీ. ఆల్ ది బెస్ట్ “” అని ఆ మెయిల్‌లో రాసుంది. (job) దాంతో లింక్డిన్‌లో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అసలు చర్మ రంగుని బట్టి కూడా ఉద్యోగుల్ని ఎంపికచేస్తామంటే ఎవ్వరికీ ఉద్యోగాలు రావేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.