Uber: ఫోన్ బ్యాటరీ లో ఉంటే.. రెట్టింపు చార్జీలు
Hyderabad: ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు చార్జీలు బాగా దండుకుంటోందని ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్(uber)పై ఆరోపణలు వస్తున్నాయి. బెల్జియం(belgium)కు చెందిన ఓ వార్తాపత్రిక ఈ ఆరోపణలు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ 12 శాతం ఉంటే ఏకంగా 6 శాతం చార్జీలను పెంచేసిందని తెలిపింది. అదే బ్యాటరీ 84 శాతం ఉంటే వేరే ధర చూపిస్తోందట. రెండు ధరలకు చాలా డిఫరెన్స్ ఉందని వార్తాపత్రిక పేర్కొంది. దీనిని నిరూపించడానికి ఇద్దరు వ్యక్తుల చేత వేర్వేరుగా ఒకే లొకేషన్‌ను ఉబర్(uber) బుక్ చేయించింది. క్యాబ్ బుక్ చేస్తున్న సమయంలో ఒకరి ఫోన్లో బ్యాటరీ 12 శాతం, ఇంకొకరి ఫోన్లో 85 శాతం ఉంది. లొకేషన్‌కు రీచ్ అవ్వగానే ఇద్దరూ చెల్లించిన డబ్బుల మధ్య చాలా తేడా ఉందని తెలిసింది.
దీనిపై ఉబర్(uber) సంస్థ స్పందించింది. బ్యాటరీ పర్సెంటేజ్‌ని బట్టి డబ్బు వసూలు చేయడంలేదని పేర్కొంది. క్యాబ్ బుక్ చేసుకుంటున్న సమయంలో ట్రాఫిక్‌ను బట్టి చార్జీలు ఉంటాయని తెలిపింది. ఉబర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేం మొదటిసారు కాదు. 2016లో ఉబర్ ఎకనామిక్ రీసెర్చ్ మాజీ హెడ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బ్యాటరీ లెవల్‌ను బట్టి ధరలు ఎంత ఎక్కువ నిర్ణయించినా చెల్లించడానికి ప్రయాణికులు రెడీగా ఉన్నారని తెలిపారు. ప్యాసెంజర్ల ఫోన్ నుంచి బ్యాటరీలు లాంటి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.