ATM నుంచి డబ్బు తీసేటప్పుడు ఇవి పాటించకపోతే నష్టమే
ATM: ఏటీఎం నుంచి డబ్బులు తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. లేదంటే నష్టపోతారు. ఇంతకీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ టిప్స్ చూసి తెలుసుకోండి.
కొందరు హ్యాకర్లు ముందుగానే ఏటీఎంలో క్లోనింగ్ పరికరాలు అమరుస్తుంటారు. ఇది మనకు తెలీదు. అలా తెలీక మన ఏటీఎం కార్డు పెట్టి డబ్బు తీసుకుని వెళ్లిపోతాం. కానీ ఆ ఏటీఎం కార్డు పెట్టగానే పిన్ నెంబర్‌తో సహా అన్ని వివరాలు ఆ హ్యాకర్లకు వెళ్లిపోతాయి. దాంతో మీరు డ్రా చేసిన డబ్బే కాదు.. మీ బ్యాంక్‌లో ఉన్న డబ్బు కూడా మాయమైపోతుంది. ఏటీఎంలలో సీసీ కెమెరాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే డబ్బులు దొంగిలించాలనుకునేవారు హిడెన్ కెమెరాలు పెడుతుంటారు. ఆ కెమెరాలను కూడా మన ఏటీఎం పిన్ నెంబర్ కనిపించే యాంగిల్‌లో అమరుస్తుంటారు. ఆ పిన్ ద్వారా డబ్బులు కాజేస్తుంటారు.
ఎలా జాగ్రత్త వహించాలి?
ఏటీఎం కార్డు పెట్టే దగ్గర ఏమైనా అరుదైన పరికరాలు ఉన్నాయా? తేడా డిజైన్లు ఏమైనా ఉన్నాయా అనేది గమనించండి.
క్లోనింగ్ పరికరాలు కాస్త లావుగా ఉంటాయి. కాబట్టి కాస్త పరిశీలనగా చూస్తే కనిపిస్తాయి
మీరు మీ ఏటీఎం పిన్ నెంబర్ టైప్ చేస్తున్నప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోండి. అప్పుడు హిడెన్ కెమెరాలు ఉన్నా కూడా కనిపించదు.
కుదిరితే మీ ఏటీఎంలలో చాలా తక్కువ మొత్తం ఉండేలా చూసుకోండి. అంటే.. మీరు ఏటీఎం తరచూ వాడుతున్నారనుకోండి.. ఆ ఏటీఎంకి చెందిన బ్యాంకులో తక్కువ సొమ్ము ఉండేలా చూసుకుంటే ఫ్రాడ్స్ నుంచి తప్పించుకోవచ్చు.