Bank Holidays: మార్చి నెలలో బ్యాంకులకు 14 రోజుల సెలవులు..!
Bank Holidays: రేపటి నుంచి 2024 మార్చి నెలా ప్రారంభం కానున్నది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆర్థిక లావాదేవీల నిర్వహణకు బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నా, కొన్ని సందర్భాల్లో ఖాతాదారులు బ్యాంకు శాఖలను సంప్రదించడం తప్పనిసరి. సేవింగ్స్ చేయడం, శాలరీ డిపాజిట్లు విత్‌డ్రా చేసుకోవడం, చెక్ బుక్, పాస్ బుక్ సేవలు పొందేందుకు బ్యాంకులకు వెళుతుంటారు. ఏరోజు ఏపని చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి మార్చి నెల రాకముందే, ఆ నెలలోని బ్యాంక్ సెలవులను గుర్తించడం ముఖ్యం.
వచ్చే నెలలో బ్యాంక్‌లు 14 రోజుల పాటు మూసి ఉంటాయి. ఆ 14 రోజుల్లో నేషనల్ పబ్లిక్ హాలిడేస్, కొన్ని ప్రాంతీయ సెలవులు, రెండు & నాలుగు శనివారాలు, ఆదివారాలు కలిసి ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్ సెలవులను నిర్ణయిస్తాయి. మార్చి నెలలో మీకు బ్యాంక్‌లో పని ఉంటే, సెలవు రోజున బ్యాంక్‌కు వెళ్లి మీ సమయం వృథా చేసుకోకుండా, బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ప్రకారం ముందుగానే మీ పనిని ప్లాన్ చేసుకోవడం మంచిది. (Bank Holidays)
అయితే బ్యాంక్ సెలవులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు ఎందుకంటే, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఈ సెలవుల వల్ల బ్యాంక్ సేవల్లో దాదాపుగా అంతరాయం ఉండదు. ఈ డిజిటల్ సర్వీస్‌లు 24 గంటలూ, భారతదేశం అంతటా కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల్లో ఏదైనా ఆటంకం ఉంటే, మీ బ్యాంక్ ముందుగానే మీకు తెలియజేస్తుంది.
2024 మార్చిలో బ్యాంక్ సెలవు రోజులు
మార్చి 01 (శుక్రవారం)- చాప్చార్ కుట్- మిజోరంలో బ్యాంక్‌లకు సెలవు
మార్చి 03 -ఆదివారం- దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 08 (శుక్రవారం)- మహా శివరాత్రి- దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు హాలిడే
మార్చి 09 – రెండో శనివారం- దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి
మార్చి 10 -ఆదివారం- దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
మార్చి 17 -ఆదివారం- దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 22- (శుక్రవారం) – బిహార్ దివస్- బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు
మార్చి 24- ఆదివార- దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
మార్చి 25- (సోమవారం)- హోలీ- కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్, శ్రీనగర్ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సెలవు
మార్చి 26- (మంగళవారం)- యయోసాంగ్ రెండో రోజు/హోలీ– ఒడిశా, మణిపూర్, బీహార్‌లో బ్యాంక్‌లు పని చేయవు
మార్చి 27- (బుధవారం -హోలీ- బీహార్‌లో బ్యాంక్‌లకు సెలవు
మార్చి 29 (శుక్రవారం)- గుడ్ ఫ్రైడే- త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము & కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సెలవు
మార్చి 30- నాలుగో శనివారం- దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతబడతాయి