Kerala: వరద బాధితులకు ఆర్థిక సాయం.. EMI కట్ చేసుకున్న బ్యాంకులు
Kerala: ఆగస్ట్ తొలి వారంలో కేరళలోని వాయనాడ్‌లో విరిగిపడిన కొండచరియలు దాదాపు 300 మంది ప్రాణాలను బలి తీసుకుంది. దాంతో ప్రభుత్వం ఫండ్స్ రూపంలో వచ్చిన డబ్బును ఆర్థిక పరిహారంగా బాధితులకు చెల్లించింది. ఇదే అదనుగా చూసిన బ్యాంకులు.. బాధితుల ఖాతాల్లో పడిన పరిహార సొమ్ము నుంచి టకటకా EMIలు కట్ చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా కేరళ గ్రామీణ బ్యాంకు నుంచే ఎక్కువ మంది ఖాతాల నుంచి ఈఎంఐ కట్ అయ్యింది.
ఈ విషయంపై మరో బ్యాంక్ అయిన కేరళ బ్యాంక్ స్పందిస్తూ.. ఎవరైతే తమకు అప్పులు కట్టాల్సిన వారు ఉన్నారో వారికి రుణ మాఫీ చేస్తామని వెల్లడించింది. ఇక గ్రామీణ బ్యాంకు ఈఎంఐలు కట్ చేసుకోవడంపై స్థానిక ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసలు జరిగాయి. వెంటనే కట్ చేసుకున్న ఈఎంఐను వారి ఖాతాల్లో జమ చేయాలని వాయనాడ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. దీనిపై గ్రామీణ బ్యాంక్ సిబ్బంది స్పందిస్తూ.. కస్టమర్ల ఖాతాలకు ఆటో డెబిట్ ఉండటం వల్లే కట్ అయ్యాయని.. తాము స్వయంగా ఏమీ చేయలేదని వెల్లడించింది.