CLAT ప‌రీక్ష‌లో టీచ‌ర్‌ను ఓడించిన విద్యార్థి..!

Banglore: ఓ ప‌రీక్ష‌లో త‌న‌కు శిక్షణ ఇచ్చిన టీచర్‌ను ఓడించాడు ఓ విద్యార్ధి. బెంగ‌ళూరుకు చెందిన ప్ర‌ధ్యోత్ షా అనే యువ‌కుడు క్లాట్ (clat) (కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్) ప‌రీక్ష రాసాడు. ఈ ప‌రీక్ష‌లో ప్ర‌ధ్యోత్‌కు రెండో ర్యాంక్ వ‌చ్చింది. కానీ ప్ర‌ధ్యోత్‌కు శిక్ష‌ణ ఇచ్చిన టీచ‌ర్ రాహుల్ పాల‌కుర్తికి మాత్రం మూడో ర్యాంక్ వ‌చ్చింది. రాహుల్ కూడా ప్ర‌ధ్యోత్‌తో పాటు క్లాట్ ప‌రీక్ష రాసారు.

లా చ‌ద‌వాల‌నుకుంటున్న విద్యార్ధుల‌కు క్లాట్ ప‌రీక్ష‌ల్లో మంచి ర్యాంక్ సాధించేలా రాహుల్ కోచింగ్ ఇస్తుంటారు. అయితే రాహుల్ కూడా అప్పుడ‌ప్పుడు క్లాట్ ప‌రీక్ష రాస్తుంటారు. ఇలా రాయ‌డం వ‌ల్ల త‌న‌ని తాను మ‌రింత మెరుగుప‌రుచుకుంటూ విద్యార్ధుల‌కు నేర్పించాల‌న్న అంశంపై మరింత ప‌ట్టు సాధిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌రోప‌క్క క్లాట్ పరీక్ష రాసిన విద్యార్ధుల్లో రాజ‌స్థాన్‌కు చెందిన విద్యార్ధి మాత్రం 100కు 100 తెచ్చుకుని మొద‌టి ర్యాంక్ సాధించాడు.

భార‌త‌దేశంలోని 22 లా యూనివ‌ర్సిటీల్లో అడ్మిష‌న్ పొందాలంటే క్లాట్ ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ప‌రీక్ష‌లో వ‌చ్చిన ర్యాంక్‌ను బట్టి అడ్మిష‌న్ ల‌భిస్తుంది. ఈ ఏడాది డిసెంబ‌ర్ 3న 139 ప‌రీక్షా కేంద్రాల్లా క్లాట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ఫ‌లితాల‌ను బట్టి విద్యార్ధుల‌ను ఎంపిక‌చేసి డిసెంబ‌ర్ 12 నుంచి కౌన్సిలింగ్ మొద‌లుపెడ‌తారు.