MLA Ticket Scam: టికెట్ ఇప్పిస్తానంటూ దొంగ బాబా మోసం
BJP ఎమ్మెల్యే టికెట్ (mla ticket scam) ఇప్పిస్తానంటూ ఓ దొంగ బాబా మోసానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. అభినవ హళసరి అనే ఓ స్వామీజీ.. గోవింద్ అనే వ్యాపారికి BJP ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికి అతని నుంచి రూ.1.5 కోట్లు దండుకున్నాడు. ఈ విషయాన్ని ఈ స్కాంలో ప్రధాన నిందితురాలైన చైత్య కుందపుర అనే హిందుత్వా యాక్టివిస్ట్ పోలీసుల విచారణలో బయటపెట్టింది. అభినవను పట్టుకుంటే అన్ని విషయాలు బయటపడతాయని ఆమె చెప్పడంతో కర్ణాటక స్పెషల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చైత్ర దొరికిపోయిందని తెలీడంతో అభినవ నిన్న రాత్రి ఒడిశాలోని భువనేశ్వర్ వెళ్లే రైలులో పారిపోవాలని అనుకున్నాడు. కానీ పోలీసులు అతన్ని కట్టక్ ప్రాంతంలో పట్టుకుని బెంగళూరుకు తరలించారు.
ఉడుపి జిల్లాలోని బిందూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు BJP ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చైత్ర గోవింద్ నుంచి దాదాపు రూ.5 కోట్ల వరకు తీసుకుంది. ఆ తర్వాత ఆమె మోసం బయటపడటంతో గోవింద్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అలా చైత్ర అన్ని విషయలు బయటపెడుతుందన్న భయంతో అభినవ పారిపోవాలని అనుకున్నాడు. మొత్తానికి పోలీసులు ఈ టికెట్ స్కాం గుట్టు రట్టు చేసారు. (mla ticket scam)